ఎంపీ వైఎస్ అవినాష్ పీఏ ఇంటికి పోలీసులు
ఆంధ్రప్రదేశ్: కడప జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. వర్రా రవీందర్‌రెడ్డి కేసు విచారణలో భాగంగా రాఘవరెడ్డితో రవీందర్‌రెడ్డి అనుమానాస్పదంగా మాట్లాడినట్లు పోలీసులు భావిస్తున్నారు. రాఘవరెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు, ఆయన లేకపోవడంతో కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో పులివెందుల అర్బన్ సీఐ జీవన్ రంగనాథ్‌తో లాయర్ ఓబులరెడ్డి మాట్లాడారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వర్రా రవీందర్‌రెడ్డి వివాదాస్పదమైన విధంగా ప్రవర్తించారని, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, వంగలపూడి అనిత లపై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. రవీందర్‌రెడ్డి మీద మంగళగిరి, హైదరాబాద్ సహా పలు చోట్ల కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.