హైదరాబాద్: ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు! తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి వంటి కీలక అంశాలపై చర్చ మొదలైంది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సియోల్ పర్యటనలో ఉన్న సమయంలో ఓ తెలుగు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపావళికి ముందు పొలిటికల్ బాంబు పేలబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి వంటి 8 నుంచి 10 ముఖ్య అంశాలకు సంబంధించిన దర్యాప్తు పూర్తి కావడంతో, ముఖ్య నేతలకు భారీ షాక్ ఎదురవుతుందని ఆయన పేర్కొన్నారు.
హాన్ నది పునరుజ్జీవం అధ్యయనం కోసం సియోల్ వెళ్లిన మంత్రుల బృందం హైదరాబాద్‌లో అడుగుపెట్టేలోపు చర్యలు ఉంటాయని పొంగులేటి స్పష్టం చేశారు.
దర్యాప్తు ప్రక్రియ దాదాపు పూర్తయిందని, అన్ని సాక్ష్యాధారాలు సమకూరినట్లు పేర్కొన్నారు.
ప్రజలు కోరుకునే విధంగా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి అంశాలపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు.
అలాగే, 15 దేశాల్లో అమల్లో ఉన్న ఉత్తమ రెవెన్యూ విధానాలను పరిశీలించి, కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు.