న్యూఢిల్లీ: దేశంలో పలు రాష్ట్రాల్లో ఇంకా కరోనా కేసుల నమోదు కొనసాగుతునే ఉన్నాయి. కాగా ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఉపెన్నికలు మరియు సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పుడు ఈ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల కమీషన్ కోరింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ గురించి ఆగస్టు 30లోపు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాలని ఈసీ తెలిపింది. ఈసీ కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవలంభించాల్సిన ముందు జాగ్రత్తలపై ఆలోచనలు చేశారు. కాగా గత కొన్ని నెలల క్రితం నిర్వహించిన ఎన్నికల పై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసారి తగు జాగ్రత్తలతో ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఆలోచిస్తోంది.
దేశంలో కోవిడ్ రెండవ దశ వ్యాప్తికి ఈ ఎన్నికలే ప్రధాన కారణమని దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టడాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల రాజకీయ పార్టీల అభిప్రాయాలను, సలహాలు, సూచనలు అడిగి తెలుసుకుంటున్నారు.