టాలీవుడ్: వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లో టాప్ పోసిషన్లో మాత్రమే కాకుండా సినిమాలకి లక్కీ చార్మ్ గా కూడా దూసుకెళ్తున్న హీరోయిన్ పూజ హెగ్డే. ఇపుడు పెద్ద హీరో ల ఫస్ట్ ఛాయస్ పూజ హెగ్డే ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఈ సంవత్సరం ఆరంభంలో వచ్చిన ‘అల వైకుంఠపురం లో‘ సక్సెస్ తో మరిన్ని ప్రాజెక్ట్ లు తన పాకెట్ లో వేసుకుంది ఈ క్రేజీ హీరోయిన్. అయితే ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తాను సౌత్ ఇండస్ట్రీ పై కొన్ని కించపరిచే మాటలు మాట్లాడిందని కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ నడుస్తున్నాయి. దీనిపై క్లారిటీ గా తన స్టేట్మెంట్ ని చెప్పి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది పూజ.
‘నేను ఇంటర్వ్యూ లో అన్న మాటల్ని వక్రీకరించారు ఆ మాటల్ని వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు. అక్షరాన్ని మార్చగలరేమో కానీ అభిమానాన్ని కాదు. నాకు ఎప్పటికీ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రాణ సమానం. ఈ విషయం నా అభిమానులకి, నా సినిమా అభిమానులకి తెలిసినా కూడా అపార్థం చేసుకోకూడదని మళ్ళీ చెప్తున్నా. నాకు ఎంతో ఇచ్చిన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎప్పుడూ రుణపడి ఉంటాను’ అని పూజ హెగ్డే తెలుగు సినిమా పరిశ్రమ పై తన అభిమానాల్ని తెలియ చేసింది. పూజా ఇదివరకు కూడా ఒక హీరోయిన్ విషయంలో చాలా ట్రోల్ల్స్ ఎదుర్కొంది. పూజా బాలీవుడ్ లో ప్లాప్ లు వచ్చినా కూడా టాలీవుడ్ లో మొదటినుండి మంచి ఆఫర్లే వచ్చాయి. తన సినిమా ప్రయాణం కూడా ‘ఒక లైలా కోసం’ అనే తెలుగు సినిమా తోనే ప్రారంభం అయింది. ప్రస్తుతం పూజా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ‘రాధే శ్యామ్’ మరియు అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’ లో నటిస్తుంది.