టాలీవుడ్: ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్ ఎవరంటే పూజ హెగ్డే పేరే వినిపిస్తుంది. ఇండస్ట్రీ లోని టాప్ లీగ్ హీరోలతో వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న ఈ హీరోయిన్ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా పూజ ప్రస్తుతం ప్రభాస్ తో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘రాధే శ్యామ్’ నుండి పూజా కి సంబందించిన పోస్టర్ విడుదల చేసారు మూవీ మేకర్స్. ‘అరవింద సామెత వీర రాఘవ’, ‘మహర్షి’, ‘అల వైకుంఠపురంలో’, ‘గద్దలకొండ గణేష్’ లాంటి విజయవంతమైన సినిమాల తర్వాత తాను ప్రస్తుతం ప్రభాస్ తో ‘రాధే శ్యామ్’ అలాగే అక్కినేని అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’ సినిమాలు నటిస్తుంది. ఈరోజు ఈ రెండు సినిమాల నుండి పూజా రోల్ కి సంబందించిన పోస్టర్స్ విడుదల చేసారు.
రాధే శ్యామ్ నుండి పుజా కి సంబందించిన క్యారెక్టర్ నేమ్ ‘ప్రేరణ’ అని చెప్తూ ఒక పోస్టర్ విడుదల చేసారు. ఈ పోస్టర్ లో పూజ వింటేజ్ లాగ కనిపిస్తూనే మోడరన్ గా ఆకట్టుకుంది. ఈ పోస్టర్ లో ఒక ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నట్టు ఉంది. సరిగ్గా చేస్తూ పూజకి ఎదురుగా ప్రభాస్ ఉన్నట్టు ఏర్పడుతుంది. ఈ సినిమా ఇప్పటికే యూరప్ లో జరిగే వింటేజ్ ప్రేమ కథ లాగా రూపొందించబడుతుంది అని మేకర్స్ హింట్ ఇచ్చారు. పోస్టర్స్ చూస్తుంటే ఇంకో క్లాసిక్ మూవీ ఆన్ ది వే అన్నట్టు అనిపిస్తుంది. అలాగే అఖిల్ తో నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ నుండి వచ్చిన లుక్ మామూలు గానే ఒక కాలేజీ వెళ్లే అమ్మాయి లుక్ లో ఉన్నట్టు అనిపించింది.