కోలీవుడ్: ఆంథాలజీ అంటే కొన్ని కథల సమాహారం, ఆది ఒకే సందర్భం లో జరిగిన వివిధ కథలు వివిధ రచయితల ద్వారా తెలుపబడి ఒక వీడియో లేదా బుక్ లేదా ఒక కలెక్షన్ లాగ వెలువడడం. సౌత్ లో మొదటి సారి అలాంటి ఒక ప్రయత్నం చేసారు తమిళ్ టాప్ డైరెక్టర్స్. 5 డైరెక్టర్లు 5 కథల సమాహారంగా రూపొందిన ‘పుతం పుదు కలై’ అనే ఆంథాలజీ సిరీస్ అక్టోబర్ 16 న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదలైంది. ఈ సిరీస్ కి అమేజింగ్ పాజిటివ్ రెస్సాన్స్ అందుతుంది. ఈ సిరీస్ ని తమిళ్ డైరెక్టర్స్ అయిన గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్ , సుధా కొంగర, కార్తీక్ సుబ్బరాజు, సుహాసిని మణి రత్నం దర్శకత్వం వహించారు.
కరోనా లాక్ డౌన్ సమయం లో జరిగిన వివిధ కథలని ఇందులో ఒక్కో డైరెక్టర్ ఒక్కో విధంగా హేండిల్ చేసారు. ఇందులో శృతి హాసన్, జయరాం, బాబీ సింహ, సుహాసిని, కళ్యాణి ప్రియదర్శిని, కాళిదాస్, అను హాసన్, సుహాసిని, ఆండ్రియా, రీతూ వర్మ , ఎం ఎస్ భాస్కర్ నటించి మెప్పించారు. ఈ ఐదు కథల్లో ముఖ్యంగా గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన షార్ట్ స్టోరీ అమితంగా ఆకట్టుకుందని టాక్. తాత మనవరాలి మధ్యన వచ్చే సంభాషణలు , తాత పాత్రలో నటించిన ఎం ఎస్ భాస్కర్ నటనకు మంచి ప్రశంసలు అందుతున్నాయి. సుధా కొంగర డైరెక్ట్ చేసిన లవ్ స్టోరీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక పేట డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ మరొక సారి డార్క్ కామెడీ తో అద్భుతమైన టైమింగ్ తో బాబీ సింహ ద్వారా మరో మంచి కథ చెప్పాడు. సుహాసిని డైరెక్ట్ చేసిన ఒక ఫామిలీ రిలేషన్ స్టోరీ కూడా ఎమోషనల్ గా ఆకట్టుకుంది. రాజీవ్ మీనన్ రూపొందించిన మరొక మెచూర్డ్ లవ్ స్టోరీ బాగానే ఉంది.
మొత్తంగా చెప్పాలంటే షార్ట్ స్టోరీస్ కాబట్టి కొంచెం ఇన్ కంప్లీట్ అనే వెలితి అనిపిస్తుంది కానీ అన్ని కథలు ఆకట్టుకున్నాయి.