టాలీవుడ్: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినీమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అయ్యి మొదటి సినిమా తోనే సూపర్ హిట్ సాధించిన డైరెక్టర్ ‘స్వరూప్ ఆర్ఎస్ జె’. చాలా గ్యాప్ తీసుకుని తాను తియ్యబోయే రెండవ సినిమాని ఈ మధ్యనే ప్రారంభించారు. ‘మిషన్ ఇంపాజిబుల్’ అంటూ టైటిల్ కూడా ప్రకటించారు. షూటింగ్ తో పాటు ఒక పోస్టర్ కూడా విడుదల చేసారు. పోస్టర్ కూడా క్రియేటివ్ గా ఉంది. ఐతే పోస్టర్ లో ముగ్గురు పిల్లలు హనుమంతుడు, శివుడు, రాముని వేషధారణలో ఉండి చేతిలో తుపాకులు పట్టుకుని ఉంటారు. అయితే ఈ పోస్టర్ వల్ల దేవుళ్ళ చేతుల్లో ఉన్న తుపాకుల వల్ల అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
అయితే ఈ విషయం ఇంకా పెద్దది కాకముందే దర్శక నిర్మాతలు దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ పై వ్యక్తమైన అభ్యంతరాలు తమ దృష్టికి వచ్చాయని, సమాజంలోని ఏ వర్గం యొక్క ఫీలింగ్స్ కి , సెంటిమెంట్స్ కి హర్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆ పోస్టర్ డిజైన్ చేయలేదని, అనుకోకుండా జరిగిన ఈ విషయానికి చింతిస్తూ ఆ పోస్టర్ ని వెనక్కి తీసుకునేలా వెంటనే చర్యలు తీసుకుంటామని మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి కలిసి మాటినీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆచార్య లాంటి పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా తీస్తూ బాలన్స్ చేస్తున్నారు ఈ నిర్మాతలు.