హైదరాబాద్: RGV ప్రస్తుతం చేస్తున్న పవర్ స్టార్ సినిమా తాలూకు ట్రైలర్ని మొట్ట మొదటి సరిగా పేమెంట్ పర్ వ్యూ పద్దతిలో వీక్షకులకు అందుబాటులో తేనున్నట్టు గత కొద్దీ రోజులుగా డప్పు కొట్టుకున్నారు. కానీ చెప్పిన ట్రైలర్ రిలీజ్ టైం కన్నా ముందే ట్రైలర్ లీక్డ్ అని ఫుల్ ట్రైలర్ యూట్యూబ్ లోకి వచ్చేసింది. దీనిపై రెస్పాండ్ అయిన ఆర్జివీ ఫుల్ ట్రైలర్ ని అఫిషియల్ గా మళ్ళీ యూట్యూబ్ లో విడుదల చేసారు. ట్రైలర్ ని పేమెంట్ పర్ వ్యూ పద్దతిలో బుక్ చేసుకున్న వాళ్ళ అందరికి డబ్బులు రిఫండ్ చేస్తాం అన్నట్టు చెప్పారు. ఎంత మంది బుక్ చేసుకున్నారన్న విషయం దేవుడెరుగు.
అసలు పైసా ఖర్చు లేకుండా సినిమాలకి పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో రామ్ గోపాల్ వర్మ దగ్గరినుండి నేర్చుకోవాలి. చూస్తుంటే పైన చేసిన ఘన కార్యం అంతా పబ్లి సిటీ కోసం ఆడిన ఒక గేమ్ లా ఉందే తప్ప నిజంగా ట్రైలర్ లీక్ అయినట్టు ఎక్కడ అనిపించడం లేదు. పైగా దీనిపై రామ్ గోపాల్ వర్మ కంప్లైంట్ లాంటివి కూడా ఏం చెయ్యకపోవడం గమనార్హం.
4 నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ లో 2019 ఎలెక్ట్షన్స్ తర్వాత పరిస్థితులని పవన్ కళ్యాణ్ ఎలా ఓడిపోయాడు, తర్వాత ఏం చేద్దామనుకున్నాడు అని అంతా ఊహాగానాలతో రచించి తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. దాదాపు 10 రోజుల్లో తీసిన ఈ సినిమా క్వాలిటీ ఏంటి అనేది ట్రైలర్ లోనే కొంత వరకు తెలిసింది. ఈనెల 25 న ఈ సినిమాని RGVWORLDTHEATRE ఓటీటీ లో అందుబాటులో ఉంచబోతున్నాడు వర్మ. దీనికి ప్రతిగా రామ్ గోపాల్ వర్మ పై గా ఇప్పటికి 2 సినిమాలు ఒక వెబ్ సిరీస్ కూడా రెడీ అవుతున్నాయి.
trailer em karma cinema whats app lo pukatlo chakarlu kodtundi