టాలీవుడ్: రాజకీయాలకి వెళ్లిన తర్వాత కొన్ని సంవత్సరాలు సినిమాలు చేయకుండా మళ్ళీ సినిమాలు మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్. తన కం బ్యాక్ సినిమాగా రాబోతున్న సినిమా ‘వకీల్ సాబ్’. ఈ మధ్యనే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి సంబందించిన షూట్ కూడా పూర్తి చేసారు. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా మార్చ్ కి ముందే పూర్తి అవాలి, కానీ చాలా కారణాల వలన ఈ సినిమా షూటింగ్ పెండింగ్ పడుతూ వస్తుంది. కొత్త సంవత్సరం సందర్భంగా న్యూ ఇయర్ రోజున రాత్రి 12 గంటలకి ‘వకీల్ సాబ్’ కి చెందిన కొత్త పోస్టర్ విడుదల చేసారు. సినిమాలో పవన్ కళ్యాణ్, శృతి హాసన్ కి సంబందించిన బైక్ డ్రైవ్ పోస్టర్ ఒకటి విడుదల చేసారు.
హిందీ లో అమితాబ్ బచ్చన్ చేసిన ‘పింక్’ సినిమాకి ఈ సినిమా రీమేక్ గా రాబోతుంది. ఈ సినిమాలో కొత్తగా పవన్ కళ్యాణ్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ జత చేసారు. అందులో భాగంగా ఒక లవ్ స్టోరీ కూడా ఆడ్ చేసారు అని టాక్. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్, శృతి హాసన్ కి మద్యల ఉండే రిలేషన్ ఆ ఎపిసోడ్ కి సంబంధించింది అయ్యి ఉండాలి. ఈ పోస్టర్ కి కొంచెం తీన్మార్, కాటమ రాయుడు పోలికలు ఉన్నాయని ట్రోల్ల్స్ కూడా బాగానే కనపడుతున్నాయి. ఈ పోస్టర్ తో పాటు ఈ సినిమాకి సంబందించిన టీజర్ ని సంక్రాతి సందర్భంగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘ఓహ్ మై ఫ్రెండ్’, ‘ఎంసీఏ’ లాంటి సినిమాలని రూపొందించిన ‘వేణు శ్రీరామ్‘ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 2021 సమ్మర్ లో ఈ సినిమాని విడుదల చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.