టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ స్టార్ డం లో అందనంత ఎత్తులో ఉన్నాడు. ఆయన వర్కింగ్ స్టిల్ రిలీస్ చేస్తేనే అదొక పెద్ద పండగలా సెలెబ్రేట్ చేసుకున్నారు ఫాన్స్. రాజకీయాల్లోకి వెళ్లి వచ్చాక ‘వకీల్ సాబ్’ అనే సినిమాతో ఏప్రిల్ లో పలకరించాడు. ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించినందుకు ఆ సినిమాని ఆకాశానికెత్తారు ఫాన్స్. ప్రస్తుతం ఒక మాస్ అప్పీల్ ఉన్న సినిమాలో నటిస్తున్నాడు, మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడబోతుందో వచ్చే సంక్రాంతి వరకు ఎదురు చూడాల్సిందే. మళయాళం లో రూపొందిన అయ్యప్పణ్ణుమ్ కోశియుమ్ సినిమాని తెలుగు లో పవన్ కళ్యాణ్ మరియు రానా లతో రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. రెబెల్ భావాలు ఉండే పోలీస్ ఆఫీసర్ అన్యాయాన్ని సహించదు. ఒక ఇగోయిస్టు ఆర్మీ ఆఫీసర్ తో ఒక గొడవ వచ్చి వాల్లిద్దరి మధ్య అది పర్సనల్ రైవల్ గా మారుతుంది. ఈ సినిమాలో బిజాయ్ మీనన్ పాత్రని పోషిస్తున్న పవన్ కళ్యాణ్ పాత్రకి సైలెంట్ గా ఉంటూనే మంచి మాస్సీ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఈ సీన్స్ కి థియేటర్లలో పూనకాలే అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వర్కింగ్ స్టిల్స్ తోనే సరి పెట్టిన ఈ సినిమా టీం టైటిల్ మరియు టీజర్ ని ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15 న ‘పవర్ స్టార్మ్’ రాబోతుంది అని చెప్పి ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాని సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. 2022 సంక్రాంతి కి ఈ సినిమా విడుదల అవనుంది.