బెంగుళూరు: 2015లో ఆస్ట్రేలియాలో జరిగిన భారతీయ మహిళ ప్రభా అరుణ్ కుమార్ హత్య కేసు ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగా నిలిచింది. న్యూ సౌత్ వేల్స్‌లో చోటుచేసుకున్న ఈ హత్య కేసును చేదించేందుకు ఆస్ట్రేలియా పోలీసులు భారీ నజరానా ప్రకటించారు.
రూ. 8 కోట్ల రివార్డ్‌ను ప్రకటించడంతో ఈ కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సిడ్నీ సమీపంలోని రోడ్డు పక్కన నడుస్తూ, భర్తతో ఫోన్‌లో మాట్లాడుతున్న ప్రభాను గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హింసించి చంపాడు.
సీసీటీవీ కెమెరాలు ఆమె రోడ్డు మీద నడిచిన దృశ్యాలను మాత్రమే రికార్డ్ చేయగలిగాయి, కానీ హంతకుడి పట్ల ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో విచారణ క్లిష్టమైంది.
ఘటన జరిగిన సమయానికి ప్రభా భర్త అరుణ్ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడటం, ఆ క్షణాల్లో ఆమె భయపెట్టే అరుపులు వినిపించడం విచారణలో కీలక అంశాలుగా మారాయి.
బెంగళూరుకు చెందిన ప్రభా ఒక ఐటీ ప్రాజెక్టు పనిలో భాగంగా సిడ్నీకి వెళ్లారు, అప్పుడే హత్యకు గురైంది. ఆ కుటుంబం ఇప్పటికీ న్యాయస్థానం తగిన న్యాయం పొందేందుకు ఎదురుచూస్తున్నారు. పోలీసులు ఆ ప్రాంతంలోని నేరస్తులపై ప్రశ్నలు వేసినా, ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు.
కేసు చివరకు ఓ పెద్ద మిస్టరీగా మిగిలిపోవడం ఆస్ట్రేలియా పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. కాబట్టి హంతకుడి లేదా సంబంధిత వ్యక్తులపై సమాచారం అందించిన వారికి రూ. ఎనిమిది కోట్ల రివార్డ్ ప్రకటించారు.