బాలీవుడ్: బాహుబలి సినిమా భారీ సక్సెస్ అయిన తర్వాత ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. తన చివరి సినిమా ‘సాహో’ తెలుగులో ఆశించినంత ఫలితం రానప్పటికీ బాలీవుడ్ లో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ‘రాధే శ్యామ్’ తో పాటు మరో రెండు సినిమాలని లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ మహానటి డైరెక్టర్ ‘నాగ్ అశ్విన్‘ తో ఉండగా మరొకటి బాలీవుడ్ డైరెక్టర్ ‘ఓం రౌత్’ తో చేస్తున్న సినిమా. అయితే మొదటి నుండి ఆదిపురుష్ టీం అంనౌన్సమెంట్స్ లలో మూవీ అప్ డేట్స్ లో దూకుడు చూపిస్తుంది. ప్రభాస్ తన తన నెక్స్ట్ సినిమా వీరిద్దరిలో ఎవరితో అనేది పక్కాగా ప్రకటించలేదు కానీ ఆదిపురుష్ టీం మాత్రం విడుదల తేదీ ప్రకటించేసింది.
2022 ఆగష్టు 11 న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్టు ఈ సినిమా టీం అధికారిక ప్రకటన చేసింది. రాధే శ్యామ్ చివరి దశలో షూటింగ్ ముగిసిన తర్వాత ఈ రెండు సినిమాల్లో ప్రభాస్ నటించనున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో రావణాసురుడి క్యారెక్టర్ లో మరో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. సీత క్యారెక్టర్ కోసం కొన్ని పేర్లు పరిశీలిస్తున్నారు కానీ ఇంతవరకు ఏదీ కన్ఫర్మ్ అవలేదు. భారీ బడ్జెట్ తో ౩డి లో రూపొందబోతున్న ఈ సినిమా పై అంచనాలు కూడా భారీ గానే ఉన్నాయి. ఈ సినిమాని తెలుగు, హిందీ మాత్రమే కాకుండా పలు ఇండియన్ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు.