fbpx
Saturday, January 18, 2025
HomeMovie News'రాధే శ్యామ్' - విక్రమాదిత్య గా ప్రభాస్

‘రాధే శ్యామ్’ – విక్రమాదిత్య గా ప్రభాస్

Prabhas AsVikramaditya FromRadheShyam

టాలీవుడ్: పాన్ ఇండియా హీరో , యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘రాధే శ్యామ్‘. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 23 న ఈ సినిమాకి సంబంధించి మోషన్ పోస్టర్ తో పాటు ‘బీట్స్ అఫ్ రాధే శ్యామ్’ అని ఒక చిన్న టీజర్ కూడా విడుదల చేస్తామని మేకర్స్ చెప్పారు. కానీ అంతకంటే ముందే మరో సర్ప్రైసింగ్ పోస్టర్ విడుదల చేసారు. ఈ పోస్టర్ ద్వారా ‘రాధే శ్యామ్’ సినిమాలో ప్రభాస్ పేరును ‘విక్రమాదిత్య’ గా రివీల్ చేసారు. ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ , ప్రమోద్ నిర్మిస్తున్నారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం యూరప్ లో షూటింగ్ చివరి దశలో ఉంది.

డియర్ కామ్రేడ్ సినిమా ద్వారా ఒక కల్ట్ క్లాసిక్ మ్యూజిక్ ఇచ్చిన ‘జస్టిన్ ప్రభాకరన్‘ ఈ సినిమాకి సంగీతం అందించనున్నట్టు ఈరోజు ప్రకటించారు. మ్యూజిక్ లవర్స్ కి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మ్యూజికల్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ సినిమాకి జస్టిన్ సంగీతం తో మరొక లెవెల్ కి తీసుకుపోవాలని ప్రభాస్ ఫాన్స్ కోరుకుంటున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వచ్చే ఏడాది వేసవికి సిద్ధం చేస్తున్నారు మేకర్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular