మూవీడెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో సెన్సేషన్. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
ఇటీవల “కల్కి 2898 ఏడి” తో మరో భారీ హిట్ అందుకున్న ప్రభాస్, వరుస సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నారు. బాహుబలి 2 తరువాత 1000 కోట్ల క్లబ్‌లో చేరిన రెండో సినిమా “కల్కి 2898 ఏడి”.
ఇప్పటికే పలు ప్రాజెక్టులు పూర్తి చేసిన ప్రభాస్, ప్రస్తుతం “ది రాజాసాబ్” సినిమా షూట్ లో బిజీ అయ్యారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.
అయితే ఇదే కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలో “ఫౌజీ”, సందీప్ రెడ్డి వంగా “స్పిరిట్”, అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “కల్కి 2898 ఏడి” సీక్వెల్ కూడా లైన్‌లో ఉన్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం షెడ్యూల్స్ పక్కాగా ప్లాన్ చేసుకుని, ఒకేసారి మూడు నాలుగు సినిమాలను సమాంతరంగా షూట్ చేయాలనుకుంటున్నారు.
గతంలో సూపర్ స్టార్ కృష్ణ ఇలాంటి పద్ధతిలో పలు ప్రాజెక్టులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ కూడా అదే రీతిలో సినిమాలను కంప్లీట్ చేయడానికి రిస్క్ తీసుకుంటున్నారు.
ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, ప్రతి ఏడాది ఒకటి లేదా రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు.
“సలార్ పార్ట్ 2” కూడా లైన్‌లో ఉండటంతో, ప్రభాస్ రాబోయే రోజుల్లో వరుసగా బాక్సాఫీస్‌పై హవా కొనసాగించనున్నాడు.