మూవీడెస్క్: తెలుగు తెరపై మళ్లీ శ్రీదేవి విజయ్ కుమార్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం సిద్ధమయ్యారు. 2002లో ప్రభాస్ హీరోగా చేసిన ఈశ్వర్ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి, ఆ తర్వాత కొన్ని తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా కనిపించారు.
అయితే అనుకున్న స్థాయిలో విజయాలు అందుకోకపోవడంతో పెద్దగా ఛాన్సులు రాలేదు. ఇక 2011లో వచ్చిన వీర చిత్రంలో రవితేజ చెల్లెలుగా నటించిన తర్వాత, సినిమాలకు దూరమయ్యారు.
కొన్నేళ్లుగా టెలివిజన్ షోలలో జడ్జ్ గా రాణిస్తున్న శ్రీదేవి, ఇప్పుడు అనూహ్యంగా నారా రోహిత్ సుందరకాండ చిత్రంలో కథానాయికగా ఎంపికయ్యారు.
ఈ చిత్రం కాన్సెప్ట్ ప్రకారం, నారా రోహిత్ వయస్సు పెరిగిన పెళ్లికాని యువకుడిగా కనిపిస్తారు. ఆయన పాత్రకు సరిపోయే వయస్సు ఉన్న హీరోయిన్ గా శ్రీదేవిని తీసుకోవడం జరిగింది.
మొదటి టీజర్ విడుదలతో పాటు, శ్రీదేవి విజయ్ కుమార్ కూడా మీడియా మీట్ లో పాల్గొని, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
ఈ చిత్రం విజయం సాధిస్తే, ఆమె మళ్లీ హీరోయిన్ గా బిజీ అవుతారని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.