మూవీడెస్క్: ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ పక్కన నటించడం అంటే ఏ హీరోయిన్స్‌కి అయినా కెరీర్ బ్రేక్. ఇప్పటివరకు అతను చేసిన సినిమాల్లో స్టార్ హీరోయిన్లు మాత్రమే ఎక్కువగా కనిపించారు.
అయితే, రీసెంట్గా ప్రభాస్ తన సినిమాల్లో ఫ్రెష్ ఫేసెస్‌ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో ఇమాన్వి ఇస్మాయెల్ అనే కొత్త హీరోయిన్ ఎంపిక కావడం ఇందుకు ఉదాహరణ.
ఈ డ్యాన్సర్ తన టాలెంట్ ద్వారా సోషల్ మీడియాలో ఫేమస్ అయినా, తెలుగు చిత్రసీమలో పెద్దగా పరిచయం లేదు.
1940ల వార్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇమాన్వి ఎంతవరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇక మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాలోనూ కొత్తగా రిద్దికుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ వంటి నటీమణులను తీసుకున్నారు.
వీరిలో చాలామందికి తెలుగు పరిశ్రమతో పెద్దగా అనుభవం లేదు. ఇది దర్శకుడి వ్యూహం అని చెప్పవచ్చు.
కథ పరమైన ఫోకస్ ఉండాలని, అలాగే కొత్త ముఖాలతో ఫ్రెష్ ఫీలింగ్ అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
అంతేకాదు, పెద్ద హీరోయిన్లు ప్రస్తుతం బాలీవుడ్, తమిళ పరిశ్రమల్లో బిజీగా ఉండటం వల్లనూ కొత్త నటీమణులకు ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే విధంగా రాబోయే రోజుల్లో ప్రభాస్ తన చిత్రాల్లో మరిన్ని కొత్తవారికి ఛాన్స్ ఇస్తాడా లేక మళ్ళీ స్టార్ హీరోయిన్లతో పనిచేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.