హైదరాబాద్: తెరాస ఎంపీ ‘జోగినపల్లి సంతోష్ కుమార్’ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరూ స్వీకరిస్తూ తమవంతు బాధ్యత ని నిర్వహిస్తున్నారు. ఈ ఛాలెంజ్ లో భాగం గా మొక్కలు నాటుతున్నారు. వాటి పోషణ ఎంత వారికి చూసుకుంటున్నారు అనేది పక్కన పెడితే మొక్కలు నాటి తోటి వాళ్ళకి ఛాలెంజ్ విసిరి ఎంతో కొంత సామాన్య ప్రజలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు స్టార్స్. ఇందులో భాగంగా చాలా మంది స్టార్స్ తమ పెరట్లోనో, స్టూడియోల్లోనో మొక్కలు నాటి తమ కర్తవ్యాన్ని నిర్వహించారు.
మొన్న శర్వానంద్ కూడా తన ఇంటి పక్కన ఉన్న పార్క్ ని దత్తత తీస్కుని ఆ పార్క్ మొత్తం బాధ్యత తనదే అని చెప్పారు. అందరిలాగా చేస్తే డార్లింగ్ స్పెషాలిటీ ఏముంది, ప్రభాస్ తన రేంజ్ కి తగ్గట్టే 1650 ఎకరాల ఆటవి ప్రాంతాన్ని దత్తత తీసుకొని దాన్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ORR పరిసరాల్లోని ఈ ఆటవి ప్రతాన్ని తన తండ్రి పేరిట అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. తన వంతు సాయంగా రూ.2 కోట్లు అందజేసిన ప్రభాస్ అవసరాన్ని బట్టి మరింత సాయం చేసేందుకు సిద్ధం అని చెప్పారు.మంత్రి ఎంపీతో కలిసి హీరో ప్రభాస్ పార్కులోని వ్యూ పాయింట్ తదితర సౌకర్యాలను పరిశీలించాడు.