మూవీడెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలో నటించనున్న చిత్రం స్పిరిట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా, ప్రభాస్ కెరీర్‌లో తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నందుకు ప్రత్యేకత సంతరించుకుంది.
ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులు ఇప్పటికే భారీ ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ పోలీస్ యూనిఫార్మ్‌లో సిగరెట్ తాగుతున్న స్టైలిష్ ఫోటో వైరల్ అవుతోంది.
ఈ ఫోటోను ప్రభాస్ అభిమానులు ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందించినా, అది చిత్రంలోని లుక్‌లా భావిస్తూ చర్చలు నడుస్తున్నాయి.
ప్రభాస్ స్టైల్, పవర్ఫుల్ అటిట్యూడ్ చూసి అభిమానులు స్పిరిట్ మరింత అదిరిపోయేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వంగా స్టోరీ టెల్లింగ్‌లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తే, ఆ కాంబో ప్రేక్షకులకు పూనకాలే అని అంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ సలార్ పార్ట్ 2, ది రాజా సాబ్, ఫౌజీ వంటి పలు ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు.
2025 మధ్యలో స్పిరిట్ షూటింగ్ ప్రారంభమవుతుందని టాక్. ఇది పవర్ఫుల్ కథాంశంతో, పోలీస్ డిపార్ట్‌మెంట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుంది.
వంగా టేకింగ్, ప్రభాస్ మాస్ ఎలివేషన్ ఈ సినిమాను పాన్ ఇండియా మాత్రమే కాక, గ్లోబల్ లెవెల్ హిట్‌గా నిలబెడతాయని అంటున్నారు.