మూవీడెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయానికి గురయ్యారు. ఈ వార్త బయటకు రావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
అయితే ప్రభాస్ సన్నిహిత వర్గాలు స్పందిస్తూ, గాయం అంత పెద్దది కాదని, కేవలం తాత్కాలిక విశ్రాంతి మాత్రమే తీసుకుంటున్నారని స్పష్టం చేశారు.
దీంతో అభిమానులు కొంత ఊరటకు నోచుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్‌ను నాన్‌స్టాప్‌గా పూర్తి చేసినట్లు సమాచారం.
ఈ హారర్ కామెడీ చిత్రానికి గాయం ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో, మేకర్స్ 2025 ఏప్రిల్ 10న రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు.
మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజీ చిత్ర షూటింగ్‌కు మాత్రం స్వల్ప బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ తాను త్వరలోనే షూటింగులకు హాజరవుతానని నిర్మాతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
గాయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్వయంగా చెప్పినట్లు తెలిసింది.
ప్రస్తుతం ఆయన అభిమానులు సోషల్ మీడియాలో #GetWellSoonPrabhas అంటూ తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.