స్టార్ హీరో ప్రభాస్‌కు సంబంధించిన ఓ పాత ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ప్రభాస్ ప్రేమగా ఓ అమ్మాయిని బుగ్గపై ముద్దు పెడుతున్నాడు. ఫ్యాన్స్ ఈ ఫోటో చూసి షాక్ అయినా, అసలు ఇది పాతదే అనే క్లారిటీ వచ్చింది.
ఇదేంటా కొత్త విషయమా అని కొందరు అనుకుంటున్నా, ఈ ఫోటో బాహుబలి షూటింగ్ సమయంలో తీసుకున్నదని తెలుస్తోంది. ముఖ్యంగా, ఇందులో ఉన్న అమ్మాయి ఎవరు అనే విషయం ఫ్యాన్స్‌లో చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఆమె మేకప్ ఆర్టిస్ట్ బిల్లి మానిక్ అని స్పష్టమైంది.
తమన్నా సన్నిహిత స్నేహితురాలిగా బిల్లి మానిక్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రభాస్ తన టీమ్‌లో ఉన్న టెక్నీషియన్స్, మేకప్ ఆర్టిస్టులతో చాలా ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తి. అందుకే, ఈ ఫోటోలో కూడా మామూలు సరదా మూడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఫ్యాన్స్ ఈ ఫోటోను చూసి “ప్రభాస్ ఎంత రిలాక్స్‌గా ఉంటాడో.. తన టీమ్‌కి ఎంత కేర్ తీసుకుంటాడో అర్థమవుతోంది” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా, ఈ పాత ఫోటో ఇప్పుడు కొత్తగా వైరల్ కావడం అందరికీ షాక్ కలిగించింది.
ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ షూటింగ్‌లతో బిజీగా ఉండగా, స్పిరిట్, కల్కి 2 ప్రాజెక్ట్స్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అలాగే సలార్ 2 కూడా షెడ్యూల్‌లో ఉంది.