మూవీడెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా ది రాజా సాబ్ అందరిలో ఆసక్తి రేపుతోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఇందులో ప్రభాస్ సరసన నటిస్తున్నారు. ఏప్రిల్ 10, 2025న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో నయనతార ఒక ప్రత్యేక పాటలో ప్రభాస్‌తో కలిసి డ్యాన్స్ చేయనున్నట్లు సమాచారం.
నిర్మాతలు ఇప్పటికే నయనతారతో సంప్రదింపులు జరిపారని, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ నెలాఖరులో ఈ పాటను గ్రాండ్‌గా చిత్రీకరించే ప్లాన్‌లో ఉన్నారు. ఈ అప్‌డేట్ అభిమానుల్లో హైప్ పెంచుతోంది.
2007లో వచ్చిన యోగి సినిమాలో ప్రభాస్-నయనతార జంటగా మెప్పించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ఒక్కసారికీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు.
ఇప్పుడు, 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ జంట తెరపై కనిపించబోతుందనే ఊహాగానాలు అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నాయి.
ప్రభాస్-నయనతార కాంబినేషన్ సీనీప్రియులకు పక్కా విజువల్ ట్రీట్‌గా మారనుంది. ఈ పాటతో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ది రాజా సాబ్ హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుండగా, నయనతార స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది.