టాలీవుడ్: టాలీవుడ్ నుండి పాన్ ఇండియా హీరోగా ఎదిగి వరుస సినిమాలు చేస్తున్న ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ అనే ప్యూర్ లవ్ స్టోరీ లో నటిస్తున్నాడు. ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ఎపుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఫిబ్రవరి 14 న ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేయనున్నట్టు రాధే శ్యామ్ సినిమా నిర్మాతలు తెలియ చేసారు. పూర్తిగా యూరోప్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా జన్మ జన్మల బంధాలతో అల్లు కున్న కథ అని రూమర్స్ నడుస్తున్నాయి. అంతే కాకుండా ఇది వింటేజ్ కథ అని ఫొటోస్, ఫస్ట్ లుక్స్ చూస్తే తెలుస్తుంది.
ఈ రోజు ఈ అప్డేట్ తో పాటు ఒక ప్రీ గ్లిమ్ప్స్ వీడియో కూడా విడులా చేసారు. ఈ వీడియో లో బాహుబలి, సాహూ లో పూర్తి యాక్షన్ పాయింట్ ఆప్ వ్యూ లో ప్రభాస్ ని చూసారు ఇప్పుడు ప్రభాస్ హార్ట్ ని చూడండి అంటూ ప్రభాస్ మంచు లో జేబు లో చేతులు పెట్టుకుంటూ వచ్చే ఒక చిన్న సీన్ ఆడ్ చేసారు. ఆ కొన్ని సెకండ్స్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే కీ-బోర్డు మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బం ఒక సూపర్ హిట్ కాబోతున్నట్టు ఆ మ్యూజిక్ బిట్ హింట్ ఇచ్చినట్టు ఉంది. డియర్ కామ్రేడ్ లాంటి సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. జస్టిన్ కూడా ఒకే పెద్ద హీరోకి పని చేయడం ఇదే మొదటిది. యూ.వీ.క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. జిల్ సినిమా డైరెక్టర్ రాధా కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి.