మూవీడెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
హారర్, రొమాంటిక్ కామెడీ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం, సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తి అయ్యిందని, టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న నాలుగు పాటల షూటింగ్‌ను త్వరలోనే పూర్తి చేయనున్నట్లు సమాచారం.
చిత్ర యూనిట్ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులపై కూడా అదే వేగంతో ముందుకెళ్తున్నారు.
2025 ఏప్రిల్ 10న విడుదల చేయాలని మేకర్స్ ముందుగా ప్రకటించినప్పటికీ, అదే రోజు సిద్ధు జొన్నలగడ్డ జాక్ సినిమా కూడా రిలీజ్ కాబోతుండటంతో, రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, మేకర్స్ ఈ విషయంపై ఇంకా స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు.
అభిమానులు మాత్రం అనుకున్న తేదీకే సినిమా విడుదలవుతుందని నమ్మకంగా ఉన్నారు.
ప్రభాస్ ఈ సినిమా ద్వారా తన కెరీర్‌లో తొలిసారి హారర్ కామెడీ జోనర్‌లో నటిస్తున్నాడు.
సినిమా సీజీ వర్క్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని టాక్ నడుస్తోంది.
ముఖ్యంగా కొన్ని సీన్స్ హ్యారీ పోటర్ సినిమాను తలపిస్తాయని, ప్రభాస్ నటన మరో లెవెల్‌లో ఉంటుందని సమాచారం.
రాజా సాబ్ సినిమా థియేటర్‌లో ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.