ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ టీజర్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటివరకు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ మినహా, మరే ప్రమోషనల్ అప్డేట్ను విడుదల చేయలేదు. ప్రభాస్ సినిమా అంటే మొదటి నుంచే హైప్ ఉంటుంది. కానీ ఈ సినిమా టీం మౌనం అభిమానులకు నిరాశను కలిగిస్తోంది.
సినిమా రిలీజ్ ఎప్పుడో సమ్మర్ అని భావించారు. కానీ ఇప్పటి వరకు ఫైనల్ డేట్ ఖరారు చేయలేదు. టీజర్ అయినా విడుదల చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నా, చిత్రబృందం ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా మౌనం పాటిస్తోంది. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ప్రమోషన్లు లేకుండా క్యూరియాసిటీ పెంచడం ఎంతవరకు మేలని చర్చ మొదలైంది.
స్టార్ హీరోల సినిమాలు టీజర్, ట్రైలర్ ద్వారా భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న తరుణంలో, రాజాసాబ్ టీం ఎందుకు నిశ్శబ్దంగా ఉంది అన్నది ప్రశ్నగా మారింది. మారుతి ఇంటర్వ్యూలలో కనిపించినా సినిమా గురించి ఏమీ చెప్పకుండా తప్పించుకోవడం అభిమానులను మరింత నిరాశకు గురిచేస్తోంది.
ఎంత ఆలస్యం చేసినా, సినిమా అంచనాలను అందుకోవాలి. టీజర్ లాంచ్‌కి ఇప్పటికైనా డేట్ ప్రకటిస్తారా? లేదా అభిమానుల ఓపిక ఇంకా పరీక్షిస్తారా? అన్నది చూడాలి. త్వరలో మేకర్స్ అధికారిక ప్రకటన ఇస్తారన్న టాక్ ఉన్నా, ఇది ఎంతవరకు నిజమో వేచి చూడాలి.