మూవీడెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ థ్రిల్లర్ మూవీ రాజాసాబ్.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది.
మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఇందులో కథానాయికలుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.
ఇప్పటివరకు ప్రభాస్ సినిమాలకి ఉన్న స్థాయి హైప్ ‘రాజాసాబ్’కి తక్కువగానే అనిపించింది. కానీ ఇటీవల విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఆ అంచనాలను అమాంతం పెంచేశాయి.
ముఖ్యంగా ఓల్డ్ లుక్‌తో సింహాసనంపై కూర్చున్న ప్రభాస్ పోస్టర్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తించింది.
ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారా అనే చర్చ ఫ్యాన్స్‌లో ప్రారంభమైంది.
మారుతి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈసారి హర్రర్ కామెడీతో కొత్త జోనర్‌లో అడుగుపెట్టడం విశేషం.
డిసెంబర్ చివర్లో సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. క్రిస్మస్ కానుకగా ‘రాజాసాబ్’ టీజర్‌ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అలాగే సంక్రాంతి సందర్భంగా మాస్ బీట్ సాంగ్ విడుదల చేయబోతున్నారని టాక్.
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి పవర్‌ఫుల్ మాస్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ప్రభాస్ డాన్స్ మూమెంట్స్, కొత్త లుక్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
2025 ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం, ప్రభాస్ కెరీర్‌లో మరో ప్రత్యేకమైన సినిమ కానుందని అభిమానులు భావిస్తున్నారు.