
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా, వంగా స్క్రిప్ట్ ఫైనల్ చేశాడట. 2025 మే నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, హను రాఘవపూడి సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ సినిమాలు పూర్తి చేసిన వెంటనే స్పిరిట్ సెట్స్‌లో అడుగు పెట్టనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కొత్త లుక్‌లో కనిపించనున్నాడు.
సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్‌ను ప్రత్యేకంగా బల్క్ డేట్స్ కేటాయించమని కోరాడట. షూటింగ్ సమయంలో ఇతర ప్రాజెక్ట్స్ చేయకూడదని కూడా స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.
ఇది ప్రభాస్‌కు పూర్తిగా కొత్త జానర్ మూవీ కాబట్టి, వంగా చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ 2026 చివర్లో రిలీజ్ కానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.