మూవీడెస్క్: ప్రభాస్ రాజా సాబ్! తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు కొదవే లేదు. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ హీరోలు డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా అందులో ఒకరు.
నేషనల్ స్టార్‌గా మారిన తర్వాత మరింతగా బిజీగా మారి, ఏకకాలంలో పలు ప్రాజెక్టులు చేస్తూ సందడి చేస్తున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘ది రాజా సాబ్’ ప్రత్యేక స్థానం పొందింది.
ఇప్పటి వరకూ చిన్న చిత్రాలనే డైరెక్ట్ చేసిన మారుతి, ఈ మూవీతో కొత్తగా ప్రభాస్‌ని హర్రర్ కామెడీ జోనర్‌లో ప్రెజెంట్ చేయబోతున్నాడు.
ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ది రాజా సాబ్’ నుండి విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నింపింది.
ఇందులో ప్రభాస్ వృద్ధుడిగా కనిపించడం నిజంగా అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది.
అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ప్రభాస్ మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపిస్తాడట.
వృద్ధుడు, మనవడు, ఆత్మగా మూడు విభిన్న రూపాల్లో కనిపించేలా డిజైన్ చేశారు.
అయితే, వాస్తవానికి ఈ మూడు లుక్స్ ఉన్నా.. సినిమాలో ప్రభాస్ రెండు పాత్రలే చేస్తున్నాడన్న టాక్ కూడా వినిపిస్తోంది.
ఏది ఏమైనా, ‘రాజా సాబ్’ నుంచి వచ్చిన ఈ అప్‌డేట్ ప్రభాస్ అభిమానులను మంచి కిక్ ఇచ్చింది.