fbpx
Saturday, December 21, 2024
HomeMovie Newsమరోసారి రామాయణం కథలో ప్రభాస్

మరోసారి రామాయణం కథలో ప్రభాస్

PRABHAS-TO-ACT-IN-LORD-SRIRAM-CHARACTER
PRABHAS-TO-ACT-IN-LORD-SRIRAM-CHARACTER

మూవీడెస్క్: ఆదిపురుష్ సినిమా అనంతరం రామాయణం కథలో ప్రభాస్ మళ్ళీ కనిపించబోతున్నట్లు న్యూ టాక్ మొదలైంది.

కానీ ఈసారి రాముడి పాత్రలో కాదని తెలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి రూపొందిస్తున్న ఈ కొత్త రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ చిత్రంలో పరశురాముడి పాత్ర కోసం మేకర్స్ ప్రభాస్‌ను సంప్రదించారని, ఆయన ఈ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేయడానికి అంగీకారం తెలిపినట్లు టాక్ వస్తోంది.

పరశురాముడి పాత్ర ఎంతో గంభీరంగా ఉండటంతో, ప్రభాస్ వంటి స్టార్ అయితే ఆ పాత్రకు న్యాయం చేస్తారని భావిస్తున్నారు.

ఒకవేళ ఈ వార్త నిజమైతే, ఈ సినిమాకు క్రేజ్ మరింత పెరిగిపోతుందని అంటున్నారు.

రణబీర్, సాయి పల్లవి, ప్రభాస్ మరియు యశ్ (రావణుడి పాత్రలో) కలిసొచ్చే ఈ భారీ ప్రాజెక్ట్, పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశముందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రభాస్, గతంలో ఆదిపురుష్ ద్వారా రామాయణం కథను టచ్ చేసినా ఫ్యాన్స్ ను పెద్దగా మెప్పించలేదు. మరి, ఈ సారి పర్ఫెక్ట్ గా మెప్పిస్తాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular