మూవీడెస్క్: నేడు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా బెస్ట్ విషెస్ అందిస్తున్నారు.
ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చెప్పుకుంటే, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రియమైన డార్లింగ్ గా ముద్ర వేసుకున్నాడు.
‘బాహుబలి’ సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్‌లో నిలిచిపోయిన ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా విశేషమైన క్రేజ్ దక్కింది.
‘బాహుబలి’ తరువాత వరుసగా ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టలేకపోయినప్పటికీ, ఆయా సినిమాలు భారీ రేంజ్ కలెక్షన్లు సాధించాయి.
ప్రభాస్ మార్కెట్ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన తన ఫ్యాన్స్ కి మళ్లీ భారీ విజయాలు అందిస్తూ, ‘సలార్’తో దుమ్ము రేపాడు.
భారీ యాక్షన్ సీక్వెన్సులు, మాస్ ఎలివేషన్‌లతో సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల వరకు వసూలు చేసింది.
ఇప్పుడాయన ‘కల్కి 2898ఏడీ’తో మళ్ళీ 1000 కోట్ల క్లబ్ లోకి చేరాడు. ఈ మూవీ ప్రభాస్‌ను మరింత హైప్ ఇచ్చింది.
ఆయన చేతిలో ప్రస్తుతం ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో మూడు సినిమాలు కచ్చితంగా 1000 కోట్ల క్లబ్‌లో ఉండబోతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగినా, ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అందరికి తెలియకపోవచ్చు.
ఆయన పూర్తి పేరు వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన ప్రభాస్, వైజాగ్‌లో సత్యానంద్ మాస్టర్ దగ్గర యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు.
20 ఏళ్ల వయసులో ‘ఈశ్వర్’ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రభాస్, బటర్ చికెన్, బిర్యాని లాంటి ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారు.
షూటింగ్స్ సమయంలో తన తోటి నటీనటులకు స్వయంగా తన ఇంటి నుండి భోజనం తెప్పిస్తారు.
ఫుడ్ అంటే చాలా ఇష్టమున్న ప్రభాస్, యాక్టర్ కాకుండా ఉంటే ఫుడ్ బిజినెస్‌లోకి వెళ్లేవాడినని స్వయంగా తెలిపారు.
అలాగే హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ డినిరో అంటే ప్రభాస్ కి స్పెషల్ లైక్. దర్శకుల్లో రాజ్ కుమార్ హిరానీ ప్రభాస్ కు చాలా ఇష్టమైన దర్శకుడు.
అతని సినిమాలు ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘3 ఇడియట్స్’ లాంటి చిత్రాలను పదేపదే చూస్తాడు.
అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న ప్రభాస్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం పొందిన మొట్టమొదటి తెలుగు హీరో కావడం విశేషం.