మూవీడెస్క్: 16 ఏళ్ల తర్వాత మరోసారి ప్రభాస్-త్రిష కాంబినేషన్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బిజీ షెడ్యూల్ లో ఉన్నారు.
కల్కి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆయన ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఈ క్రమంలో, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
స్పిరిట్ మూవీలో హీరోయిన్గా సీనియర్ హీరోయిన్ త్రిష పేరు పరిశీలనలో ఉందట. గతంలో ‘వర్షం’, ‘పౌర్ణమి’, ‘బుజ్జిగాడు’ వంటి చిత్రాల్లో ప్రభాస్-త్రిష జంటగా నటించారు.
ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తించింది. 16 ఏళ్ల విరామం తర్వాత మరల ఈ జంట స్పిరిట్ సినిమాలో కనిపిస్తుందనే వార్త సినీ లవర్స్ లో పెద్ద బజ్ క్రియేట్ చేస్తోంది.
త్రిషతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం, ఆమె పాత్రకు మంచి స్కోప్ ఉండటంతో, త్రిష అయితే బెస్ట్ అన్న అభిప్రాయానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ కాంబినేషన్ కోలీవుడ్ లో కూడా స్పిరిట్ సినిమాకి మంచి ఆదరణ కలిగించనుంది.
త్రిష పాత్ర ఈ సినిమాలో ఎంతవరకు ఇంపాక్ట్ సృష్టిస్తుందో చూడాలి, కానీ, ఈ వార్త ప్రభాస్ అభిమానులకు మాత్రం మంచి కిక్ ఇస్తోంది.