పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 2025లో అత్యంత బిజీగా ఉండబోతున్నాడు. ఇప్పటికే ఆయన చేతిలో రాజా సాబ్, హను రాఘవపూడి మూవీ, స్పిరిట్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో రాజా సాబ్ ఇప్పటికే చివరి దశకు చేరుకోగా, హను రాఘవపూడి సినిమా 1940ల నాటి కథతో ప్రత్యేకమైన పీరియాడికల్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది.
ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ పూర్తిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందే స్పిరిట్ సినిమా కోసం సమయం కేటాయించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుందని టాక్. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం.
ఇంతకుముందు ప్రభాస్ ఒకేసారి ఒకటి లేదా రెండు సినిమాలు చేసే వాడు. కానీ, ఈసారి మూడు ప్రాజెక్టులను బ్యాలెన్స్ చేయడం అతనికి భారీ ఛాలెంజ్. అన్ని సినిమాలను సమర్థంగా పూర్తి చేయడం, ప్రమోషన్స్ నిర్వహించడం కీలకమవుతుంది.
2025 ప్రభాస్ కెరీర్‌లో కీలకమైన సంవత్సరం కానుంది. ఈ సినిమాలు పెద్ద హిట్స్ అయితే, ఆయన క్రేజ్ మరింత పెరగడం ఖాయం.