హైదరాబాద్: ఒకప్పుడు ప్రభాస్ అంటే తెలుగు రాష్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఇప్పడు ప్రభాస్ అంటే భారత దేశంలోనే కాకుండా చాల దేశాల్లో సుపరిచితమే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ట్ అనే కాకుండా పాన్ వరల్డ్ స్టార్ట్ అనడం ఒకింత అతిశయమే కానీ ఆ మాటని పూర్తిగా కొట్టిపారేయాలేం ఎందుకంటే వివిధ దేశాల్లో ప్రభాస్ కి వస్తున్నా గుర్తింపులే దానికి సాక్ష్యం.
ఈ మధ్య రష్యా విడుదల చేసిన రష్యన్ హార్ట్స్ అవార్డుని ప్రభాస్ గెలుగుచుకున్నాడు. ఆ పేరే చెపుతుంది ఇది ఒక జ్యూరీ కాదు ప్రజల గుండెల్ని కొల్లగొట్టాడని, మన దగ్గరే కాదు రష్యా వాళ్ళకి కూడా ప్రభాస్ డార్లింగ్ అయిపోయాడు. 30 సంవత్త్సరాల క్రితం బాలీవుడ్ హీరో రాజ్ కపూర్ కి ఈ అవార్డు లభించింది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ భారత నటుడికి దక్కని అవార్డు ప్రభాస్ ని వరించింది. బాహుబలి సినిమా వచ్చి ఇన్ని సంవత్సారాలు అయినా కూడా ఎదో ఒక అవార్డు రూపంలో ఆ సినిమా యూనిట్ మొత్తానికి మధురానుభూతుల్ని మిగుల్చుతుంది. ఇలా చూస్తూ పోతూ ఉంటె బాహుబలి అవార్డ్స్ కి ఫుల్ స్టాప్ పడేట్టు లేదు.
ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం జిల్ మూవీ తీసిన డైరెక్టర్ రాధకృష్ణ తో ఒక పీరియడ్ రొమాంటిక్ స్టోరీ తీస్తున్నాడు అలాగే తరవాత మహానటి డైరెక్టర్ నాగి తో ఇంకొక సినిమా కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నారు, దీనిని అశ్వినిదత్ ప్రతిషాత్మకంగా నిర్మిస్తున్నారు. ముందుగా చెప్పినట్టే ఇది పాన్ వరల్డ్ మూవీ అవ్వాలని ఆశిస్తున్నాం.