టాలీవుడ్: కెజిఫ్ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రస్తుతం చేస్తున్న కెజిఫ్ చాప్టర్ 2 పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయ్. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం మన దగ్గరే కాకుండా ఏషియా లోని వివిధ దేశాల్లో కూడా ప్రభాస్ కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్ అయ్యి ఒక సినిమా రాబోతుంది.కొద్దీ రోజులుగా ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అని రూమర్స్ వచ్చాయి, ఇపుడు అదే విషయం అధికారికంగా ప్రకటించారు మూవీ మేకర్స్.
వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా పేరు ‘సలార్’ అని ప్రకటించి ఒక పోస్టర్ కూడా విడుదల చేసారు. సలార్ అంటే నాయకుడు లేదా లీడర్ అని అర్ధం వస్తుంది. ఈ పోస్టర్ లో ప్రభాస్ కొంచెం ఏజ్డ్ లుక్ లో ఉన్నాడు. ‘బాగా క్రూరమైన వ్యక్తి ఒక వ్యక్తిని బాగా క్రూరమైన వాడు అని అన్నాడు’ అని ఇంగ్లీష్ లో టాగ్ లైన్ జత చేసారు. కెజిఫ్ చాప్టర్ 1 మరియు కెజిఫ్ చాప్టర్ 2 సినిమాలని నిర్మిస్తున్న హోంబలే ఫిలింస్ తమ మూడవ సినిమాగా ఈ సినిమాని నిర్మించనుంది. వరుస పెట్టి పాన్ ఇండియా ప్రాజెక్టులు ప్రకటిస్తున్న ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. దాని తర్వాత ‘ఆది పురుష్’ చేస్తాడా లేక ‘సలార్’ చేస్తాడా లేదా మహానటి డైరెక్టర్ నాగి తో సినిమా చేస్తాడా అనేది ఇంకా అధికారికంగా ఐతే తేల్చలేదు.