టాలీవుడ్: బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గానే కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్ళింది. మన సినిమాలు జపాన్, మలేసియా దేశాల్లో కూడా విడుదల అవుతాయి. కానీ ఇక్కడ ఉన్నంత క్రేజ్ కానీ బజ్ కానీ ఉండదు. రజినీకాంత్, షారుఖ్ లాంటి హీరో ల సినిమాలకి కొంచెం మంచి కలెక్షన్స్ వస్తుంటాయి. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలకి కూడా అక్కడ బాగా క్రేజ్ పెరిగింది. బాహుబలి మూవీ జపాన్ మరియు రష్యా వంటి దేశాల్లో మంచి ఆదరణ దక్కించుకుంది. జపాన్ లో ప్రస్తుతం ప్రభాస్ , రానా కార్టూన్స్ కూడా అమ్ముతున్నారు అంటే వాళ్ళ క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు.
మన దగ్గర పోయిన సంవత్సరం విడుదల అయ్యి అంతగా ఆడకపోయినా సాహో సినిమా ఈ సంవత్సరం ఆరంభం లో జపాన్ లో విడుదల అయింది. కానీ కరోనా కారణంగా థియేటర్స్ అన్ని మూత బడడం తో ఈ సినిమా టాక్ కానీ కలెక్షన్స్ గురించి కానీ అంతగా వినపడలేదు. ఇప్పుడు అక్కడ లాక్డౌన్ ముగించి థియేటర్స్ తెరుచుకోవడం తో అందరూ థియేటర్స్ కి రావడం మొదలు పెట్టారు. లాక్ డౌన్ తర్వాత సాహో మళ్ళీ రీ-రిలీజ్ చేయడం తో ప్రస్తుతం అక్కడ సాహో ప్రభంజనం నడుస్తుంది. అప్పటి వరకు ఉన్న అమీర్ ఖాన్ దంగల్ రికార్డుని సాహో అధిగమించింది. ఇక జపాన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్ లో సాహో, దంగల్, ఇంగ్లీష్ వింగ్లీష్, 3 ఇడియట్స్, ముత్తు మరియు బాహుబలి2 చిత్రాలు ఉన్నాయి. కాగా టాప్ 5 మూవీస్ లో రెండు ప్రభాస్ వి కావడం విశేషం. ఇది సరిపోదా ప్రభాస్ యూనివర్సల్ స్టార్ అని చెప్పడానికి.