కోలీవుడ్: గ్రూప్ డాన్సర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కొరియోగ్రాఫర్ గా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇండియన్ మైకేల్ జాక్సన్ అనే స్టేజికి ఎదిగిన డాన్స్ మాస్టర్ ప్రభుదేవా. ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా రకాల సినిమాలు చేసి డైరెక్టర్ గా కూడా తన మార్క్ చూపించి మంచి హిట్స్ కొట్టాడు. ఇపుడు మరో కొత్త రూపంలో అభిమానుల్ని పలకరించనున్నాడు. ప్రభుదేవా ప్రస్తుతం ‘బఘీర’ అనే సినిమాలో ప్రతి నాయకుడిగా నటించబోతున్నాడు. ఈ సినిమా నుండి విడుదలైన ప్రభు దేవా లుక్ కొత్తగా అనిపిస్తుంది.
రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ మద్యే విడుదల అయ్యింది. ప్రభుదేవా ఈ సినిమాలో ఒక సీరియల్ కిల్లర్ అవతారంలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం తో పాటు హిందీ లో కూడా రూపొందిస్తున్నారు. 2021 సమ్మర్ ని టార్గెట్ చేసుకొని ఈ సినిమాని రూపొందిస్తున్నారు. చాలా రకాల పాత్రల్లో ఆకర్షించిన ప్రభుదేవా విలన్ గా ఎలా అలరిస్తాడో చూడాలి.