టాలీవుడ్: బుల్లితెర యాంకర్ గా గత కొన్ని సంవత్సరాలుగా టాప్ పొజిషన్ లో ఉన్న ప్రదీప్ మాచిరాజు హీరోగా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమా రూపొందింది. అన్నీ బాగుంటే పోయిన సంవత్సరం మార్చ్ 30 న ఈ సినిమా విడుదల అవ్వాల్సింది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదలకి నోచుకోలేదు. ఓటీటీ లో విడుదల చేస్తారు అని వార్తలు వచ్చినప్పటికీ ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఇపుడు థియేటర్లు తెరచుకొని విడుదలవుతున్న సినిమాలకి రెస్పాన్స్ బాగుండడం తో ఈ సినిమా విడుదల తేదీ కూడా ఇవాళ ప్రకటించారు. జనవరి 29 న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు సినిమా టీం ప్రకటించింది.
ప్రదీప్ హీరో గా వస్తున్నా మొదటి సినిమా ఇది. ఇందులో ప్రదీప్ కి జోడీ గా బిగిల్ బ్యూటీ అమృత అయ్యర్ నటించింది. ఈ సినిమా నుండి ‘నీలి నీలి ఆకాశం’ అనే పాట బాగా ఫేమస్ అయింది. ఒక విధంగా ఈ సినిమా అందరికి తెలియడానికి కూడా ఆ పాటే కారణం. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి అందించిన సంగీతం మంచి హిట్ అయింది. ఎస్ వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్ వీ బాబు ఈ సినిమాని నిర్మించారు. ఫణి (మున్నా) అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవబోతున్నాడు. రిపబ్లిక్ డే వీక్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రదీప్ కి మంచి బ్రేక్ ఇవ్వాలని ఆశిద్దాం.