fbpx
Tuesday, April 22, 2025
HomeMovie Newsపునర్జన్మల కథతో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'

పునర్జన్మల కథతో ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’

PradeepMachiraju DebutMovie TrailerRelease

టాలీవుడ్: తెలుగు స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న మొదటి సినిమా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. పోయిన సంవత్సరం మార్చ్ 30 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయ్యి ఈనెల 29 న థియేటర్ లలో విడుదల అవబోతుంది. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ఈరోజు విడుదల చేసారు. ట్రైలర్ లో ఒక వూరిలో ఉండే ఒక ప్రేమ కథ మరియు కాలేజ్ లో జరిగే ఒక ప్రేమ కథ లను చూపించాడు. చివర్లో పూజలు చేసినట్టు చూపించి మొదటి జంట ఉన్న చోటికే విధి ఇంకో జంటని చేర్చేట్టు చూపించాడు. మొత్తంగా చూసినట్లయితే ఇది ఒకే జంట మధ్య ఉండే జన్మ జన్మల ప్రేమ కథని చూపించినట్టు అర్ధం అవుతుంది.

అంతే కాకుండా ఈ సినిమాలో ఎపుడూ కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ,ఒకరిని ఒకరు టీజ్ చేసుకుంటూ ఉండే హీరో హీరోయిన్లు ఒక కారణంగా 30 రోజుల్లో ప్రేమించుకోవాలి అనే కండిషన్ ని చివర్లో చూపించారు. ఆ కారణం ఏంటి వీళ్లిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు పాత జన్మ జ్ఞాపకాలు ఎలా గుర్తుకువస్తాయి అనేది మిగతా కథ అని అర్ధం అవుతుంది. ఇలాంటి కథ తో ఇదివరకే నాగార్జున ‘జానకి రాముడు’, రామ్ చరణ్ ‘మగధీర’, అల్లరి నరేష్ ‘ప్రాణం’ లాంటి సినిమాలు వచ్చాయి. కొన్ని సూపర్ హిట్ అవ్వగా కొన్ని పరవాలేదనిపించాయి. మున్నా అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. బిగిల్ సినిమా ఫేమ్ ‘అమృత అయ్యర్’ ఈ సినిమాలో ప్రదీప్ కి జోడీ గా నటిస్తుంది. మరి కొన్ని పాత్రల్లో వైవా హర్ష, హైపర్ ఆది నటిస్తున్నారు. ఈనెల 29 న విడుదల అవ్వబోయే ఈ సినిమా ప్రదీప్ కి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుందాం.

30 Rojullo Preminchadam Ela Trailer | Pradeep Machiraju,Amritha Aiyer | Munna | Anup Rubens |SV Babu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular