భోపాల్: భారత జాతీయా పార్టీ నాయకురాలు అయిన భోపాల్ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిగా ఉందని ఆమె ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన ఆమెను విమానంలో ముంబై నగరానికి తీసుకెళ్ళారు.
ఇప్పుడు ఆమె ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భోపాల్ లోని ఎంపీ కార్యాలయం అధికారులు ఈ వివరాలను అధికారికంగా మీడియాకు వెల్లడించారు. అయితే ప్రజ్ఞా ఠాకూర్ కోవిడ్-19 ప్రేరిత లక్షణాలతో గత ఏడాది డిసెంబర్‌లో ఎయిమ్స్‌లో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.
2008 మాలెగావ్ బాంబు దాడిలో నిందితురాలిగా ఉన్న ఆమెకు అనారోగ్య కారణాల రీత్యా జాతీయ దర్యాప్తు సంస్థ 2017లో బెయిల్ మంజూరు చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ సింగ్‌పై 3.6 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించి ఎంపీ అయ్యారు.