అమరావతి: ప్రకాష్ రాజ్‌కి పవన్ వార్నింగ్! తిరుమల లడ్డూ (TTD LADDU) వ్యవహారం, ప్రస్తుతం రాజకీయ వర్గాలనే కాకుండా సినీ పరిశ్రమలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంద్రకీలాద్రిలో శుద్ధి కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో, కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
ప్రసిద్ధ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్‌పై పవన్ కళ్యాణ్ గట్టి స్పందన ఇవ్వడంతో వారి మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ప్రకాష్ రాజ్ ఇటీవల పవన్‌ను ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్‌తో ఈ వివాదం మొదలైంది.
ఆయన ట్వీట్‌లో, “తిరుమల లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ఈ వివాదంలో మీరు అనవసర భయాలు సృష్టిస్తున్నారు, మతపరమైన ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నారు,” అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నలు సంధించారు.
దీనిపై పవన్ స్పందిస్తూ, సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇక ఇటీవల ప్రకాష్ రాజ్, పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, “నా కామెంట్స్ ను తప్పుగా అర్థం చేసుకున్నారు.
ఇప్పుడు విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నాను. సెప్టెంబర్ 30 తర్వాత ఇండియాకు వస్తాను. అప్పుడు మీ ప్రతీ ప్రశ్నకు సమాధానం చెబుతా” అంటూ వీడియో ద్వారా ప్రకటించారు.
ఇదే సమయంలో మంచు విష్ణు కూడా ఈ వివాదంపై స్పందిస్తూ, “తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు, అది కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక” అని ప్రకాష్ రాజ్‌కు హితవు పలికారు.
ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఇండియాకు తిరిగి వచ్చాక, ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని సినీ, రాజకీయ వర్గాలు అంటున్నాయి.