పాట్నా: రాజకీయాల్లో బాగా తెలిసిన పేరు ప్రశాంత్ కిశోర్! ఆయన తాజాగా రాజకీయ పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటీంచారు. తన పార్టీ పూర్తి విషయాలను త్వరలో ప్రకటించడానికి ఆయన సన్నాహాలు ప్రారంభించారు.
ప్రశాంత్ కిశోర్ గత రెండు సంవత్సరాల నుండి బీహార్ లో జన్ సురాజ్ అనే పేరుతో పాదయాత్రను మొదలు పెట్టారు. ఇక ఆ పాదయాత్ర పేరుతోనే రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు ప్రశాంత్ కిశోర్ ఆదివారం వెల్లడించారు.
ప్రశాంత్ కిశోర్ తను ప్రారంభించనున్న నూతన పార్టీని అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి రోఉన ప్రకటించనున్నట్లు తెలిపారు.
కాగా, 2025 లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ఇక మిగతా పార్టీ నాయకత్వం, పార్టీ కార్యవర్గం కు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
ప్రశాంత్ కిశోర్ అంటేనే రాజకీయ వ్యూహకర్తగా పేరు ఉంది. ఆయన దేశంలోని పలు పార్టీల విజయాల్లో ఎంతో కీలకపాత్రను పోషించారు.
తరువాత రాజకీయాల్లోకి వచ్చి జేడీయూ పార్టీలో చేరారు. జేడీయూ పార్టీ కి జాతీయ ఉపాధ్యక్ష పదవిని కూడా చేపట్టి, కొన్ని పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి బహిష్కరణకు కూడా గురయ్యారు.