బీహార్: జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలపై ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఆమరణ దీక్ష ప్రారంభించారు.
పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, అందువల్ల వాటిని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ అంశంపై రెండు వారాలుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కానీ అధికారులు పరీక్షలను రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ తన ఆందోళనను ఆమరణ దీక్షగా మార్చారు. “పరీక్షల్లో అవకతవకలు అభ్యర్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయి. యువతకు న్యాయం జరగాలి,” అంటూ ప్రశాంత్ తన డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.
ప్రశాంత్ కిశోర్ దీక్షపై బీహార్ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. అలాగే ప్రశాంత్ కిషోర్ అధికారులపై ఒత్తిడి తెచ్చేలా కేంద్ర మంత్రులతో చర్చలకు కూడా సిద్ధమైనట్లు టాక్ వస్తోంది.
అలాగే బీహార్ లో తన బలాన్ని మరింత మెరుగుపరుచుకునే విదంగా ప్రశాంత్ కిషోర్ లోకల్ నాయకులను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నట్లు టాక్.
ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతుండగా, అభ్యర్థులు ఈ దీక్షతో కొత్త ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరిస్తుందా అనేది వేచిచూడాల్సిన విషయం.