టాలీవుడ్: ‘అ!’ అనే ఒక కొత్త రకమైన సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. కమర్షియల్ హంగులకి దూరంగా ఉంటూ కేవలం కథ, కథనాలు నమ్ముకొని ముందుగు సాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ. తన మొదటి సినిమా ‘అ!’ తోనే విమర్శకుల నుండి ప్రశంసలు పొందిన ఈ డైరెక్టర్, తర్వాత ‘కల్కి’ చిత్రంతో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అందించాడు. ఇది ఆశించినంత విజయం సాదించనప్పటికీ సినిమాకి మంచి పేరే వచ్చింది. ప్రస్తుతం ఈ దర్శకుడు తన మూడవ సినిమాకి కరోనా థీమ్ ఎంచుకున్నాడు.
కరోనా భయంతో షూటింగ్స్ అన్నీ అటకెక్కిన వేల కరోనా పైన్నే రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడు. ఇదే అంశం పై ప్రశాంత్ వర్మ కూడా మరో సినిమా తీస్తున్నాడు. దీనికి సంబంచిన టైటిల్ అనౌన్స్మెంట్ రేపు చేయబోతున్నట్టు ప్రకటించాడు ఈ డైరెక్టర్. ఈ పరిస్థితుల్లో షూటింగులు అన్ని ఆగిపోయినా కూడా ఈ డైరెక్టర్ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. తాను తీసిన రెండు సినిమాలకి థ్రిల్లింగ్ జానర్ నే ఎంచుకున్న ఈ డైరెక్టర్ ఈ సినిమా కూడా థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తోనే తీస్తాడేమో అనిపిస్తుంది.