న్యూ ఢిల్లీ: భారత రాష్ట్రపతి/అధ్యక్షుడు శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు ఉదయం స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. రాష్ట్రపతి ఇవాళ కాస్త ఛాతీ అసౌకర్యానికి గురైన తరువాత చికిత్స కోసం న్యూ ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (రీసెర్చ్ అండ్ రెఫరల్) కు వెళ్ళారు.
75 ఏళ్ల వయసు గల రాష్ట్రపతి చికిత్సకు సంబంధించిన మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన సాధారణ ఆరోగ్య తనిఖీలో ఉన్నారు మరియు అతన్ని పరిశీలనలో ఉంచామన్నారు. రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని తెలిపారు.
కొన్ని అవసరమైన పరీక్షల నిర్వహణ అనంతరం ఆయనను తనిఖీలో ఉంచి ఎప్పుడు డిస్చార్జ్ చేస్తమనే విషయం తెలియ జేస్తారని సమాచారం.