fbpx
Thursday, May 8, 2025
HomeMovie News'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ప్రీ టీజర్

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రీ టీజర్

PreTeaser From MostEligibleBachelorMovie

హైదరాబాద్: సినిమా పబ్లిసిటీ కోసం రక రకాల పేర్లు చెప్పి జనాల నోళ్ళల్లో తమ సినిమా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. ఫస్ట్ లుక్ అని ప్రీ లుక్ అని, టీజర్ అని, ప్రీ టీజర్ అని ఇలా తమ వంతు ప్రయత్నంగా ఒక్కొక్కటి విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే అక్కినేని అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా టీం ఇవాళ ప్రీ టీజర్ ని విడుదల చేసింది. టీజర్ ని దసరా కానుకగా 25th అక్టోబర్ న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. విడుదలైన ప్రీటీజర్ ద్వారా హీరో క్యారెక్టర్ పేరు, హీరో గోల్స్, లైఫ్ పైన, పెళ్లి పైన తన ఉదేశ్యం గురించి చెప్పి ముగించేశాడు. తన కెరీర్ ని హాపీ గ ప్లాన్ చేసి పెళ్లి వద్ద ఎందుకు తడబడ్డాడు అనేది డైరెక్టర్ చెప్పాలనుకున్న కథ అన్నట్టు హింట్ ఇచ్చేసాడు.

చాలా సంవత్సరాల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమా ద్వారా మళ్ళీ డైరెక్షన్ చేయబోతున్నాడు. భాస్కర్ తన ఇదివరటి సినిమాల్లాగానే బలమైన ఫామిలీ ఎమోషన్స్ మరియు లవ్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. తన సక్సెస్ ఫార్ములా కూడా అదే. తన కెరీర్ లో బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచినా ఆరంజ్ కూడా బడ్జెట్ ఫెయిల్యూర్ మాత్రమే తప్ప కంటెంట్ పరంగా ఆ సినిమాని తీసిపారెయ్యలేం. ఇప్పటికీ ఆ సినిమా చాల మందికి ఫేవరేట్. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాని ‘GA 2 ‘ పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ కి జోడీ గా ‘పూజ హెగ్డే’ నటిస్తుంది. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని 2021 సంక్రాంతి బరిలో లేదా 2020 క్రిస్టమస్ వరకు విడుదల చేసే క్రమంలో మేకర్స్ ఉన్నారు.

Most Eligible Bachelor Pre Teaser | Akhil Akkineni, Pooja Hegde | Bommarillu Baskar | #MEB

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular