మాలీవుడ్: మళయాళం సినిమాలు బాగుంటాయి అని తెలుసు కానీ ఎందుకో కమర్షియల్ సినిమాలకి వచ్చినంత గుర్తింపు రాదు. కానీ ఈ లాక్ డౌన్ సమయంలో చాలా మంది గత 5 నుండి 10 సంవత్సరాల్లో వచ్చిన మలయాళం సినిమాలల్లో మంచి సినిమాలన్నీ కవర్ చేసారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పాండెమిక్ మలయాళం సినిమాలకి కొత్త మార్కెట్ తెచ్చి పెట్టింది అని చెప్పవచ్చు. తెలుగు లో చాలా మలయాళం సినిమాలు డబ్ అయ్యాయి. అంతే కాకుండా మలయాళం లో విడుదలైన ‘దృశ్యం 2 ‘ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే చాలా వ్యూస్ తెచ్చుకుని కొత్త రెకార్డ్ సృష్టించింది.
ప్రస్తుతం మరో మలయాళం మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడులకి సిద్ధం అవుతుంది. పృద్విరాజ్ సుకుమారన్ నటించిన ‘కోల్డ్ కేస్’ అనే సినిమా ఓటీటీ లో విడుదలవనుంది. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాలో పృద్విరాజ్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఒక ప్రదేశంలో దొరికిన ఎముకలతో మొదలుపెట్టిన ఒక మర్డర్ మిస్టరీ కేస్ అనేక మలుపులు తిరగనున్నట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. బ్లాక్ మ్యాజిక్ లాంటి అంశాలు కూడా టచ్ చేస్తినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో మరో స్పెషల్ రోల్ లో అరువి ఫేమ్ అదితి బాలన్ నటిస్తుంది. తను బల్క్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 30 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో స్ట్రీమ్ అవనుంది.