కోలీవుడ్: తమిళ నటుడు మాధవన్ ప్రస్తుతం అన్నీ తానై ‘రాకెట్రీ’ అనే సినిమాని రూపొందించాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ కి అశేష స్పందన లభించడంతో పాటు ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. ఈ సినిమాలో హీరో గా నటించడమే కాకుండా కథ, నిర్మాత, దర్శకుడు ఇలా ఈ సినిమా కోసం ఒక్కడే చాలా విభాగాల్లో పని చేసాడు మాధవన్. ఇస్రో సైంటిస్ట్ అయిన నంబి నారాయణన్ అనుకోకుండా తన పై దేశ ద్రోహం కేసు పడితే, డబ్బులు వెదజల్లి మన టాలెంట్ ని వేరే దేశాలు కొనడానికి ప్రయత్నించినా కూడా తన టాలెంట్ దేశం కోసం మాత్రమే పని చేయాలనే ఉద్దేశంతో దేశం గర్వించదగ్గ సైంటిస్ట్ గా ఎదిగిన నంబి నారాయణన్ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
నంబి నారాయణన్ 2019 లో పద్మభూషణ్ అవార్డు పొందడమే కాకుండా తన పై పడిన అపవాదు కూడా పోగొట్టుకున్నాడు. ఈ సినిమా గురించి నంబి ద్వారా మాధవన్ ప్రధాని నరేంద్ర మోడీ ని కలిశారు. మోడీ కూడా ఈ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడి ఈ సినిమా కథ చాలా మంది తెల్సుకోవాలి అని ట్వీట్ చేసాడు. అంతే కాకుండా ఈ సినిమా కోసం నేను కూడా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళం లో ఇలా ఆరు భాషల్లో ఈ వేసవి లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.