fbpx
Sunday, January 19, 2025
HomeMovie NewsI.N.G: 'ప్రియదర్శి' కొత్త వెబ్ సిరీస్

I.N.G: ‘ప్రియదర్శి’ కొత్త వెబ్ సిరీస్

Priyadarshi NewWebSeries Announcement

టాలీవుడ్: కమెడియన్ గా పరిచయం అయ్యి మల్లేశం లాంటి హీరో పాత్రలే కాకుండా ‘మెయిల్’ లాంటి ఓటీటీ సినిమాల్లో కొన్ని మంచి కారెక్టర్లు చేసుకుంటూ కెరీర్ లో దూసుకువెళ్తున్నాడు ప్రియదర్శి. ఇదివరకు zee 5 ఓటీటీ లో ‘లూజర్’ అనే వెబ్ సిరీస్ లో నటించిన ప్రియదర్శి ఇపుడు మరో వెబ్ సిరీస్ తో మన ముందుకు రాబోతున్నాడు. I .N .G – ఇన్ ది నేమ్ అఫ్ గాడ్ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ రూపొందుతుంది. ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన అనౌన్స్మెంట్ ఈరోజు చేసారు. ఆహ ఓటీటీ వారు ఆహా ఒరిజినల్స్ కంటెంట్ గా ఈ సీరియస్ ని రూపొందించారు.

కొన్ని చిన్న సినిమాల్ని కొని ఓటీటీ లో స్ట్రీమ్ చేయడమే కాకుండా కొన్ని కొత్త సినిమాలు , ఇలాంటి సిరీస్ లని ఆహా ఒరిజినల్స్ పేరుతో రూపొందించి యూసర్ బేస్ ని పెంచుకుంటుంది ఆహా. ఒక క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ రూపొందుతుంది. ఈ సిరీస్ ఫస్ట్ లుక్ కూడా ఈరోజు విడుదల చేసారు. బ్యాక్ గ్రౌండ్ లో కాలిపోతున్న ఒక కార్, సిగరెట్ అంటుపెడుతున్న ప్రియదర్శి ని చూపించారు. ‘దేవుడి పేరుతో ఎంత దూరం వెళ్తావ్’ అనే టాగ్ లైన్ జత చేసి ఈ ఫస్ట్ లుక్ ని షేర్ చేశారు. ఈ సిరీస్ లో బిగ్ బాస్ ఫేమ్ నందిని రాయ్ నటిస్తుంది. విద్యాసాగర్ ముత్తు కుమార్ అనే దర్శకుడు ఈ సిరీస్ ని రూపొందించారు. మరి కొద్దీ రోజుల్లో ఈ సిరీస్ ని ఆహా లో స్ట్రీమ్ చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular