హైదరాబాద్: పెళ్లి చూపులు సినిమా ద్వారా తెలుగు సినిమాల్లో ప్రవేశించి మంచి పేరు సంపాదించిన కమెడియన్ ప్రియదర్శి పులికొండ. మొదట్లో అర్జున్ రెడ్డి, తొలిప్రేమ, ఎంసిఏ,బ్రోచేవారెవరురా , గ్యాంగ్ లీడర్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాల్లో ఫ్రెండ్ రోల్ లో , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరే సంపాదించాడు. ఆ తర్వాత మల్లేశం సినిమా ద్వారా ఒక ఇన్స్పిరేషనల్ బయోపిక్ మూవీ లో చక్కని నటన కనబర్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత మిఠాయి అనే సినిమా లో కూడా హీరో గా ప్రయత్నించాడు కానీ అది అంతగా ఆడలేదు. సినిమాలే కాకుండా లూజర్ అనే వెబ్ సిరీస్ ద్వారా కూడా అభిమానులను పలకరించాడు. zee5 లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ లాక్ డౌన్ సమయంలో జనాల ఆదరణ బాగానే పొందింది.
ఇపుడు మరోసారి అదే దారిలో ఇంకో ప్రయత్నం చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. మహా నటి రూపొందించిన స్వప్న దత్ దీన్ని కూడా నిర్మిస్తున్నారు. ఇంతకీ ఇది సినేమానా లేక వెబ్ సిరీస్ అనే విషయం క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. స్వప్న సినిమాస్ బ్యానర్ పై ”కంబాలపల్లి కథలు” టైటిల్ తో ఒక సినిమా/వెబ్ సిరీస్ ని స్వప్న దత్ నిర్మిస్తున్నారు.ఉదయ్ గుర్రాల అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. టైటిల్ ని బట్టి చూస్తే ఇది వెబ్ సిరీస్ లాగానే ఉంది. ఇందులో ప్రియదర్శి ‘హైబత్’ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇంతకుముందు ప్రియదర్శి తెలంగాణ మాండలికం లో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్. ఇందులో కూడా అదే మండలికంతో రాబోతున్నాడు ఈ నటుడు.