
అన్ని అడ్డంకులు ధాటి సినిమా అంతా పూర్తి అయ్యి విడుదల చేద్దాం అనుకుంటే మనోభావాలు దెబ్బ తిన్నాయి అని వివిధ వర్గాల వారు, టైటిల్ నాది అని , నా కథని కాపీ కొట్టారు అని మరొకరు, నా పాట కాపీ కొట్టారు అని మరొకరు ఇలా రక రకాల వాళ్ళని సంతృప్తి పరచడానికి నిర్మాత ఎంతో కొంత సమర్పించుకోవాల్సి వస్తుంది. లేదంటే సినిమా వివాదాల్లో చిక్కుకుని విడుదలకి నోచుకోలేని పరిస్థితి నెలకుంటుంది. ఇవి అన్ని దాటుకుని సినిమాని విడుదల చేస్తే కొన్ని సార్లు సినిమా విడుదల అవకముందే పైరసీ రూపం లో నిర్మాత ఆశల పై నీళ్లు చల్లుతున్నారు. థియేటర్లలో నడుస్తున్న సినిమాని పైరసీ చేస్తే దాని వల్ల వచ్చే నష్టం కూడా నిర్మాత పైన ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా పైరసీ ని పూర్తిగా అంతమొందించలేకపోతున్నారు.
వీటితో పాటు హీరో చేసిన ఇంతకముందు సినిమా లాస్ లో ఉంటె దాని నష్టాల్ని పూరించండి లేకపోతే ఈ సినిమా ఆపేస్తాం అని రకరకాల గొడవల మధ్య నిర్మాత నలిగిపోతున్నాడు. వీటన్నికి తోడు గత సంవత్సర కాలంగా కరోనా రూపంలో దేశం లోని ప్రతీ ఇండస్ట్రీ కుదేలయింది. అందులో సినిమా ఇండస్ట్రీ కూడా ఒకటి. మిగతా ఇండస్ట్రీ లు ఎదో ఒక రూపం లో కొద్దిగా ఒపేరేషన్స్ ని నిర్వహిస్తూ ఎదో ఒక రకంగా నష్టాన్ని కొంత తగ్గించుకుంటున్నాయి. కానీ సినిమా ఇండస్ట్రీ లో ఆ పరిస్థితి లేదు. షూటింగ్ లు ఆలస్యం అవడం తో సెట్ లకి రెంట్ లు కట్టడం, రిలీస్ ఆలస్యం అవుతుండడం తో ఫైనాన్స్ కి తెచ్చిన డబ్బులకి ఇంట్రెస్ట్ భారం ఇలా రక రకాలుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిర్మాత ఎన్నో బాధలు పడుతున్నాడు. సరే ఇవన్నీ దాటుకుని సినిమా హిట్ ఐన తర్వాత కొందరి పేరు కోసం ఇన్ని కలెక్షన్లు అని అన్ని కలెక్షన్లు అన్ని ప్రకటించుకుని పోతుంటే టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ నిర్మాతలపై రైడ్స్ ప్రకటిస్తున్నారు.
మరి వీటన్నిటికీ పరిష్కారం ఏంటి అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. పెద్ద పెద్ద నిర్మాతలే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెనకడుగు వేస్తున్నారు. తమ ఉనికిని చాటుకోవడానికి చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో ఉన్నాం అని అనిపించుకుంటున్నారు. ఫిలిం మేకింగ్ లో కొన్ని మార్పులు, ప్రీ-ప్రొడక్షన్ పగడ్బందీగా చేయడం లాంటివి మంచి ఫలితాలిస్తున్నాయి కానీ ఇంకొన్ని విషయాల్లో మార్పులు వస్తే నిర్మాత కొంత తేరుకోగలడేమో.
ఇన్ని భారాల్ని మోస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముందుండి సినిమాని నిడిపించే నిర్మాత , నాలుగు పైసల్ని వెనకేసుకోవాల్సిన నిర్మాత, అందరికి కన్నా వెనకపడి నలిగిపోతున్నాడు.