టాలీవుడ్: సినీ ఇండస్ట్రీ లో వరుసగా ఎదురవుతున్న మరణాలు ఇండస్ట్రీ ని కలచి వేస్తున్నాయి. అప్పటిదాకా మనతో ఉన్నవాళ్లే సడన్ గా తిరిగిరాని లోకాలకి వెళ్లారు అన్న మాట వినగానే చాలా బాధగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది ఇలాగే ఫీల్ అవుతున్నారు. ఒక PRO గా , ప్రొడ్యూసర్ గా, ఫిలిం జర్నలిస్ట్ గా, సినిమా పత్రిక స్థాపకుడిగా ఇండస్ట్రీ లో కొనసాగుతున్న బి.ఏ.రాజు గారు నిన్న గుండెపోటు తో మరణించారు. ఒక PRO చనిపోతే ఇంత మంది బాధ పడుతున్నారు అంటే ఇండస్ట్రీ లో ఆయన ఎంత మందికి ఆప్తులో అర్ధం అవుతుంది.
ఇండస్ట్రీ ప్రయాణంలో దాదాపు ఒక 30 – 40 సంవత్సరాల పాటు ఆయన కొనసాగారు. ఒక పత్రికా విలేఖరి గా ప్రయాణం ప్రారంభించి, సినీ జర్నలిస్ట్ ఆ తర్వాత ‘సూపర్ హిట్’ అనే ఫిలిం మ్యాగజైన్ స్థాపించి ప్రస్తుతం ఉన్న డిజిటల్ వరల్డ్ లో కూడా కొనసాగిస్తున్నారు. నిర్మాత గా కూడా తన బ్యానర్ లో తన భార్య బి.ఏ.జయ దర్శకత్వంలో ఆయన సినిమాలు నిర్మించారు.
ఇండస్ట్రీ లో బి.ఏ.రాజు చాలా మందికి ఆప్తులు. ఈ సినిమా ఆ సినిమా అని కాకుండా శుక్రవారం విడుదలయ్యే ప్రతి సినిమా హిట్ కావాలని కోరుకునే వ్యక్తుల్లో రాజు గారు ఒకరు. ప్రతీ హీరోతో రాజుగారికి మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధమే ఇపుడు వాళ్ళందిరిని ఒకేసారి బాధలో నెట్టేసింది. సూపర్ స్టార్ కృష్ణ తో, మహేష్ బాబు ఫామిలీ కి మరీ బాగా అనుభందం ఉన్న రాజు గారి గౌతమ్ సినిమాలకి కూడా PRO గా చేస్తా అని అనేవారని మహేష్ బాబు తన అనుబంధాన్ని చెప్పారు. కేవలం నటులే కాకుండా మీడియా లో కూడా చాలా మందికి ఉపాధి కల్పించి ఎంతో మందికి జీవితం ప్రసాదించిన మహా వ్యక్తి బి.ఏ.రాజు గారు ఇక లేరు అన్న విషయాన్ని ఆయనను దగ్గరి నుండి చూసిన వ్యక్తులు ఇంకా మరచిపోలేకపోతున్నారు.